“పుష్ప” అక్కడ స్పీడ్ పెంచాల్సిందేనా.?

Published on Nov 18, 2021 1:41 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ సినిమా “పుష్ప”. వీరి కాంబో నుంచి వస్తున్న మొట్ట మొదటి పాన్ ఇండియన్ సినిమా ఇది కావడంతో దీనిపై మంచి అంచనాలు కూడా ఉన్నాయి. అయితే ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతుండగా ఈ చిత్రం హిందీ రిలీజ్ పట్ల ఈ మధ్య కాస్త సందిగ్ధం నెలకొంది.

కానీ మళ్ళీ లైన్ క్లీ అవ్వడంతో హిందీ రిలీజ్ మళ్ళీ ఫిక్స్ అయ్యింది. అయితే ఇప్పుడున్న సమయంలో హిందీ మార్కెట్ కి సంబంధించి ఈ సినిమా స్పీడ్ పెంచాల్సిందే అనిపిస్తుంది. ఇంకా సినిమా షూటింగ్ బ్యాలన్స్ ఉంది. కానీ ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ కావాల్సి ఉంది. మన దగ్గర ఎలాగో పర్లేదు కానీ బన్నీకి ప్రిస్టేజియస్ గా ఉన్న హిందీ మార్కెట్ లో మాత్రం మంచి ప్రమోషన్స్ చెయ్యక తప్పదు. కాస్త ముందే ఈ పని స్టార్ట్ చేస్తే ఈ సినిమాకి ఇంకా మంచిది మరి మేకర్స్ ఎప్పుడు ఇవన్నీ స్టార్ట్ చేస్తారో చూడాలి.

సంబంధిత సమాచారం :

More