‘పుష్ప’ ట్రైలర్ తో అదరగొట్టిన బన్నీ !

Published on Dec 6, 2021 10:05 pm IST

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో రాబోతున్న సినిమా ‘పుష్ప’. కాగా తాజాగా ఈ చిత్రం తొలిభాగం ట్రైలర్ రిలీజ్ అయింది. ట్రైలర్ లో.. కథలోని మెయిన్ ఎమోషన్స్ ను, బన్నీ పాత్రలోని షేడ్స్ ను, అలాగే రష్మిక మండన్నాతో సాగే లవ్ ట్రాక్ ను మరియు అన్నిటికి కంటే ముఖ్యంగా సినిమాలోని కీలకమైన అడవి నేపథ్యాన్ని… ఆ నేపథ్యం తాలూకు మెయిన్ సీక్వెన్సెస్ ఎస్టాబ్లిష్ షాట్స్ ను, మరియు ఎర్రచందనం స్మగ్లింగ్ సీన్స్ తాలూకు ఎలివేషన్ షాట్స్ ను సుకుమార్ ట్రైలర్ లో చాలా బాగా కట్ చేశాడు.

ఇక ట్రైలర్ లో బన్నీ చెప్పిన డైలాగ్స్ కూడా చాలా బాగున్నాయి. పుష్ప అంటే ప్లవర్ అనుకున్నావా.. ఫైర్’ అంటూ బన్నీ చెప్పగానే బ్లాస్ట్ విజువల్స్ రావడం చాలా బాగా ఆకట్టుకుంది. అలాగే పోలీసుల నుంచి హీరో ఎదుర్కొనే అవరోధాలను, గొడవలను కూడా సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడని.. ట్రైలర్ లోని విజువల్స్ ను చూస్తే అర్ధం అవుతుంది. ఇక ట్రైలర్ లో పుష్ప రాజ్ పాత్రలోని వేరియేషన్స్ తో పాటు అతని ఆలోచనా విధానాన్ని, అలాగే అతని పరిస్థితులను కూడా సుకుమార్ చాలా బాగా చూపించాడు. నటన పరంగా ఇక బన్నీ అద్భుతంగా నటించాడు.

పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమా పై బన్నీ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ , సాంగ్స్, టీజర్ ల పై బన్నీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. కాగా ఇప్పుడు ఈ ట్రైలర్ వారిని ఇంకా బాగా ఆకట్టుకుంటుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :