యూట్యూబ్‌లో పుష్పరాజ్ ట్రైలర్ హవా.. తగ్గదే లే..!

Published on Dec 8, 2021 3:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే మొన్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే.

కాగా ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో 30 మిలియన్ ప్లస్ వీవ్స్‌తో తగ్గేదేలా అనేట్టుగా దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఫాహాద్ ఫజిల్, అనసూయ, సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.సంబంధిత సమాచారం :