తగ్గదే లే.. పుష్ప ట్రైలర్ టీజ్ అవుట్..!

Published on Dec 3, 2021 7:46 pm IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మికా మందన్నా హీరోయిన్‌గా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “పుష్ప”. పాన్‌ ఇండియన్ చిత్రంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుద‌ల చేయ‌నున్నారు. మొదటి భాగం “పుష్ప ది రైజ్” పేరుతో డిసెంబర్ 17వ తేదిన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే సినిమా విడుదల తేది దగ్గరపడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్‌ స్పీడును కూడా పెంచేశారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్‌, టీజర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ వచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబరు 6న ఈ సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేయనున్న నేపధ్యంలో తాజాగా ‘ట్రైలర్‌ టీజ్‌’ను రిలీజ్ చేశారు. 26 సెకన్ల నిడివి గల ఈ టీజ్‌లో అల్లు అర్జున్‌ ఊరమాస్‌ లుక్‌, కొన్ని యాక్షన్‌ సీన్స్‌, రష్మిక, అనసూయ పాత్రలను చూపించారు. కాగా ట్రైలర్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పుష్ప ట్రైలర్ టీజ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :