ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘పుష్ప’ విలన్ సినిమా

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘పుష్ప’ విలన్ సినిమా

Published on Jul 11, 2024 9:04 AM IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సెన్సేషనల్ పాన్ ఇండియా హిట్ చిత్రం “పుష్ప” తో తెలుగు ఆడియెన్స్ కి దగ్గరైన టాలెంటెడ్ మళయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కోసం అందరికీ తెలిసిందే. మరి ఫాఫా ఇప్పుడు పలు భారీ చిత్రాలు దక్షిణాదిలో దాదాపు అన్ని భాషల్లో చేస్తుండగా తన రీసెంట్ చిత్రం “ఆవేశం” బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు అయితే తెలుగులో తన చిత్రం ఒకటి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చింది.

గత 2023లో కేజీయఫ్ నిర్మాణ సంస్థ హోంబళే ఫిల్మ్స్ తో దర్శకుడు పవన్ కుమార్ తెరకెక్కించిన ఆ చిత్రమే “ధూమం”. మరి ఈ చిత్రాన్ని నేటి నుంచి ఆహా వారు స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చారు. ఇక ఈ చిత్రంలో ఆకాశం నీ హద్దురా ఫేమ్ అపర్ణ బాలమురళీ ఫీమేల్ లీడ్ లో నటించగా ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా అయితే మేకర్స్ దీన్ని తీసుకొచ్చారు. మరి తెలుగులో ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇప్పుడు ఈ చిత్రాన్ని ఆహా వారు స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు. అందులో ట్రై చేయవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు