మరింత హిలేరియస్ గా ‘పుష్పక విమానం’ లేటెస్ట్ ప్రోమో.!

Published on Nov 11, 2021 2:01 pm IST

టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ ఎంటర్టైనింగ్ చిత్రం “పుష్పక విమానం”. మొదటి నుంచి మంచి అంచనాలతో రిలీజ్ కి దగ్గర అవుతున్న సమయంలో మంచి ప్రమోషన్స్ తో మరింత హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం రేపు రిలీజ్ కి రెడీగా ఉంది. మరి ఈ గ్యాప్ లో చిత్ర యూనిట్ ఇంకో ఆసక్తికర ప్రోమోని రిలీజ్ చేసారు.

ఆల్రెడీ ట్రైలర్ తో మంచి ఫన్ ని జెనరేట్ చేసి డిఫరెంట్ గా అనిపించింది. ఇప్పుడు లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ప్రోమో మరింత హిలేరియస్ గా అనిపిస్తుంది. తన భార్య అంటూ ఆనంద్ రోల్ ఒక్కొక్కరికి ఒకో అమ్మాయిని పరిచయం చెయ్యడం పోలీస్ రోల్ లో చేసిన సునీల్ దగ్గరకి వచ్చాక ఓ క్లారిటీ రావడం ఇవన్నీ చూస్తూనే సూపర్బ్ ఫన్నీగా అనిపిస్తున్నాయి.

మొత్తానికి ఈ సినిమాతో మళ్ళీ థియేటర్స్ లో ఆడియెన్స్ బాగా నవ్వుకొని ఎంజాయ్ చెయ్యడం గ్యారెంటీ అనిపిస్తుంది. ఇక ఈ సినిమాని దామోదర దర్శకత్వం వహించగా విజయ్ దేవరకొండ ఈ సినిమాని ప్రెజెంట్ చేస్తున్నాడు.

ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More