“పుష్పక విమానం” అక్కడ కూడా మంచి వసూళ్లు రాబడుతుందిగా..!

Published on Nov 15, 2021 7:00 pm IST


యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా, దామోదర దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. ఈ శుక్రవారం థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని మంచి వసూళ్లను సాధిస్తుంది. ఈ వారం రిలీజైన సినిమాల్లో యూఎస్, ఆస్ట్రేలియా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ లో ఫస్ట్ ప్లేస్‌లో ‘పుష్పక విమానం’ ఉంది. యూఎస్‌లో శనివారం వరకే ఈ సినిమా 70 వేల అమెరికన్ డాలర్స్ కలెక్షన్స్ రాబట్టగా, వీకెండ్ కలెక్షన్స్ కూడా కలుపుకుంటే లక్ష యూఎస్ డాలర్స్ మార్క్ కు రీచ్ అవుతుందని చిత్ర బృందం ఆశిస్తోంది. యూఎస్ బాక్సాఫీస్ దగ్గర లక్ష డాలర్లకు చేరువకావడం ఫేర్ కలెక్షన్ అని ట్రేడ్ వర్గాలుంటున్నాయి.

అలాగే ఈ సినిమా ఆస్ట్రేలియాలో 16,512 డాలర్లు కలెక్ట్ చేసి ఈ వారం రిలీజైన తెలుగు సినిమాలలో టాప్‌గా నిలిచింది. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ “పుష్పక విమానం” సినిమాను లాస్ట్ ఫ్రైడే విన్నర్ అని అంటున్నారు. గత శుక్రవారం రిలీజైన చిత్రాల్లో “పుష్పక విమానం” సినిమా వైపే ప్రేక్షకులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని, ఈ సినిమా బాగుందనే టాక్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ థియేటర్స్ కు వస్తున్నారు. మహిళల గురించి ఓ మంచి విషయాన్ని చెప్పిన సినిమా కాబట్టి సకుటుంబ ప్రేక్షకులకు “పుష్పక విమానం”పై పాజిటివ్ ఓపీనియన్ ఏర్పడింది. దాంతో మల్టీప్లెక్స్ థియేటర్స్ సహా సింగిల్ స్క్రీన్స్ లో ఆక్యుపెన్సీ పెరుగుతోందని ఎగ్జిబిటర్స్ చెబుతున్నారు. ఈ వారంలో వస్తున్న వసూళ్లు, పెరుగుతున్న టాక్ అనలైజ్ చేస్తే ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం” సినిమాతో మరో డీసెంట్ హిట్ కొట్టాడనే అనుకోవచ్చు.

సంబంధిత సమాచారం :