విజయ్ వల్లే ఇంత అటెన్షన్ వచ్చింది – ‘పుష్పక విమానం’ హీరోయిన్

Published on Nov 11, 2021 9:30 pm IST

రేపు శుక్రవారం రిలీజ్ కి రెడీగా ఉన్న ఇంట్రెస్టింగ్ చిత్రాల్లో టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన సినిమా “పుష్పక విమానం” కూడా ఒకటి. డీసెంట్ బజ్ తో మంచి కంటెంట్ తో ఈ సినిమా రిలీజ్ కి వస్తుంది. మరి ఈ సినిమా రిలీజ్ టైం ప్రమోషన్స్ లో హీరోయిన్ గీత్ సైని హీరోయిన్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలే చెప్పింది.

అసలు తన సినిమాకి మెయిన్ అటెన్షన్ నే విజయ్ దేవరకొండ పేరు వల్ల వచ్చింది అని చెప్పుకొచ్చింది. తన ప్రమోషనల్ స్ట్రాటజీతో సినిమాని ఇంకో లెవెల్ కి తీసుకెళ్లాడని అలాగే విజయ్ తన రియల్ లైఫ్ లో చాలా కూల్ గా ఉంటాడని చెప్పింది. కొత్త కొత్త ప్రోమోస్ తో సినిమాపై ఆడియెన్స్ లో మరిన్ని అంచనాలు పెంచుకున్న చిత్రం రేపు రిలీజ్ తో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :