డిజిటల్ ప్రీమియర్ కి డేట్ ఫిక్స్ చేసుకున్న పుష్పక విమానం!

Published on Dec 1, 2021 6:40 pm IST


ఆనంద్ దేవరకొండ హీరోగా, గీత్ శైని, శాన్వీ మేఘన, సునీల్ నరేష్, హర్ష వర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించిన చిత్రం పుష్పక విమానం. ఈ చిత్రానికి దామోదర దర్శకత్వం వహించారు. విజయ్ దేవరకొండ సమర్పణలో తెరకెక్కిన ఈ చిత్రానికి గోవర్ధన రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలు గా వ్యవహరించారు.

ఈ చిత్రం థియేటర్ల లో విడుదల అయ్యి ప్రేక్షకులను అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం గా ఉంది. ఈ చిత్రం డిసెంబర్ 10 వ తేదీన ఆహా వీడియో లోకి రానుంది. అందుకు సంబంధించిన సరికొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది.

సంబంధిత సమాచారం :