ఫ్యామిలీ ఆడియన్స్‌తో “పుష్పక విమానం” సినిమా టీమ్ స్పెషల్ ఇంటరాక్షన్..!

Published on Nov 20, 2021 9:13 pm IST


యంగ్‌ హీరో ఆనంద్‌ దేవరకొండ హీరోగా, దామోదర దర్శకుడిగా తెరకెక్కిన చిత్రం ‘పుష్పక విమానం’. గత వారం విడుదలైన ఈ సినిమా హిలేరియస్ ఫ్యామిలీ ఎంతర్‌టైనర్‌గా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. రిలీజైన ప్రతి థియేటర్‌లో సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఆడియెన్స్‌తో స్పెషల్‌గా ఇంటరాక్ట్ అయ్యింది. హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్లు గీత్ సైని, శాన్వి మేఘన, దర్శకుడు దామోదర, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ అనురాగ్ పర్వతనేని, నటుడు కిరీటి ప్రేక్షకులతో సరదాగా సినిమా గురించి ముచ్చటించారు.

ఈ సందర్భంగా పుష్పక విమానం సినిమా తమకు ఎంతగా నచ్చిందో ఆడియెన్స్ టీమ్ సభ్యులకు చెప్పారు. ఎక్కడా ఇబ్బంది పడకుండా ఫ్యామిలీతో కలిసి పుష్పక విమానం సినిమా చూసి ఎంజాయ్ చేశామని ఇంటరాక్షన్‌లో పాల్గొన్న ప్రేక్షకులు చెప్పారు. లాక్‌డౌన్ తర్వాత ఆడియెన్స్ కు ఒక మంచి నవ్వించే సినిమా అందించాలనే పుష్పక విమానం సినిమా చేసినట్లు ఆనంద్ దేవరకొండ అన్నారు. తాము అనుకున్న పర్పస్ నెరవేరిందని, సినిమా హిట్ చేసినందుకు ఆడియెన్స్ కు థాంక్స్ చెప్పారు. హీరోయిన్ లు శాన్వీ మేఘన, గీత్ సైని, దర్శకుడు దామోదర పుష్పక విమానం చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ గురించి అక్కడి ప్రేక్షకులతో పంచుకున్నారు. పుష్పక విమానం సినిమా థియేటర్‌లలో ఆడియెన్స్ ఎంతగా నవ్వుకున్నారో వీడియో ద్వారా ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు.

సంబంధిత సమాచారం :

More