అక్టోబర్ 30వ తేదిన ‘పుష్పక విమానం’ ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్న బన్నీ..!

అక్టోబర్ 30వ తేదిన ‘పుష్పక విమానం’ ట్రైలర్‌ని రిలీజ్ చేయనున్న బన్నీ..!

Published on Oct 26, 2021 2:20 AM IST


దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. నూతన దర్శకుడు దామోదర ఈ సినిమాని తెరకెక్కించారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీని కింగ్ అఫ్ ది హిల్ ప్రొడక్షన్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ దషి, ప్రదీప్ ఎర్రబెల్లిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

అయితే నవంబర్ 12న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపధ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ని ఈ నెల 30వ తేదిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విజయ్ దేవరకొండ కూడా హాజరు కానున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు