ఆనంద్ దేవరకొండ “పుష్పక విమానం” ట్రైలర్ రిలీజ్..!

Published on Oct 30, 2021 9:57 pm IST


దొరసాని, మిడిల్ క్లాస్ మెలోడీస్ చిత్రాల తర్వాత ఆనంద్ దేవరకొండ నటిస్తున్న చిత్రం ‘పుష్పక విమానం’. నూతన దర్శకుడు దామోదర ఈ సినిమాని తెరకెక్కించారు. హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీకి గోవర్ధన్ రావు దేవరకొండ, విజయ్ మట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. నవంబర్ 12న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది.

అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇందులో ఆనంద్ ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. అతడికి ఓ అమ్మాయితో పెళ్లి జరగ్గా ఆమె పెళ్లైన‌ ప‌ది రోజుల‌కే లేచిపోతుంది. ఈ నేపధ్యంలో ఆనంద్ ఎలాంటి ఇబ్బందులు ఎదురుకున్నాడు? అసలు ఆనంద్ భార్య ఎందుకు వెళ్ళిపోయిందనేది? అనేది తెలియాలంటే సినిమాను చూడాల్సిందే. వినూత్న కాన్సెప్ట్‌తో వ‌స్తున్న ఈ సినిమా ట్రైల‌ర్‌ అందరిని ఆకట్టుకుంటుంది. ఇదిలా ఉంటే సునీల్‌, నరేశ్‌, హర్షవర్థన్‌ తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :

More