ప్రముఖ నటుడు సోనూసూద్ జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ జీవితం ఆధారంగా ఒక బయోపిక్ ను
నిర్మించనున్నారని తెలిసిందే. ప్రస్తుతం ఈచిత్రం యొక్క స్క్రిప్ట్ ను పూర్తి చేశే పనిలో వున్నారు. వచ్చే ఏడాది జనవరిలో లేదా ఫిబ్రవరిలో కానీ ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూ లో ఈచిత్రం గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు సోనూసూద్. ఈచిత్రాన్ని కేవలం తెలుగు, హిందీ భాషల్లో మాత్రమే కాకుండా మిగిలిన భాషల్లో కూడా నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నారు.
అలాగే ఈ బయోపిక్ లో సింధూపాత్రలో ఎవరు నటిస్తారో అనే అంశం ఫై యూత్ ను సంప్రదిస్తామని వారు ఎవరిని రిఫర్ చేస్తే వారిని తీసుకుంటామని అన్నారు. ఒక వేళ సింధూ నే నటించాలని ప్రేక్షకులు అడిగితే ఆమెను తీసుకుంటామని అన్నారు. సింధూ నటిస్తే బాగుంటుంది అని మేము అనుకుంటున్నాం. ఒకవేళ ఆమెకు ఇష్టం లేకపోతే కొద్దీ సేపైనా ఆమె సినిమాలో కనబడేలా చూస్తామని సోనూ వెల్లడించారు.
