“ఆర్ఆర్ఆర్”కు నెగెటివ్ రివ్యూలపై పీవీపీ ఫైర్..!

Published on Mar 26, 2022 1:43 am IST

జూనియర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ మల్టీస్టారర్లుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన “ఆర్‌ఆర్‌ఆర్‌” చిత్రం నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ని సొంతం చేసుకుంది. అయితే అభిమానులు, ప్రేక్షకులు, సినీ తారలు అందరూ ఆర్ఆర్ఆర్ సినిమాపై పొగడ్తల వర్షం కురిపిస్తుంటే.. మరికొందరు మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ క్రమంలో “ఆర్ఆర్ఆర్”కి నెగిటివ్ రివ్యూలపై వైసీపీ నేత, వ్యాపారవేత్త ప్రసాద్ వి.పొట్లూరి మండిపడ్డారు.

జీవితంలో ఒక షాట్ తియ్యలేదు, ఒక్క రోజు షూటింగ్‌లో నిలబడింది లేదు.. కానీ అందరికి సినిమాలు తీయ్యడంలో క్లాసులు పీకుతారు..
సినీప్రపంచంలో భయపడుతూ బ్రతికేవాళ్లందరు, మీ కష్టాన్ని అపహాస్యం చేసేవాళ్ళ మీద తిరగపడండి. నాకు ఈ సినిమా హీరోలతో, దర్శక నిర్మాతలతో ఇప్పుడు, మున్ముందున వ్యాపారం లేదు.. కాస్త తెలుగోడిగా, గర్వపడిండిరా కొడకల్లారా.. కళకు కులం పిచ్చి అంటించే కొడుకులకు, కుత్తుక కొయ్యాలి అని అన్నాడు. జాతి గర్వించే కధలు, దేశభక్తితో నెత్తురు ఉడికించే సినిమాను చూసి శభాష్ అనాలి.. మన తెలుగు వాడు, ఒక జాతీయ సంపద అయినందుకు మనవాడని ఆనందపడాలని పీవీపీ అన్నాడు.

సంబంధిత సమాచారం :