‘రాజుగారి గది-2’ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్న నిర్మాతలు !
Published on Oct 16, 2017 12:33 pm IST

తెలుగు పరిశ్రమలో నిర్మాణ సంస్థలు పివిపి, మ్యాటనీ ఎంటర్టైన్మెంట్స్ అంటే మంచి సినిమాలని అందిస్తాయనే మంచి పేరుంది. గతంలో ఈ రెండు సంస్థలు కలిసి చేసిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘క్షణం’ సెన్సేషనల్ హిట్ కాగా మరొక చిత్రం ‘ఘాజి’ ఈ ఏడాదే విడుదల అద్భుత విజయాన్నందుకుంది. దీంతో ఈ రెండు సంస్థలు కలిస్తే మంచి ఔట్ ఫుట్ బయటికొస్తుందనే నమ్మకమేర్పడింది ప్రేక్షకుల్లో.

ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోడానికే అన్నట్టు ఈ రెండు సంస్థలు కలిసి తాజాగా ‘రాజుగారి గది-2’ అనే సినిమాను రూపొందించాయి. నాగార్జున, సమంతలు ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం గత శుక్రవారం విడుదలై మంచి విజయం దిశగా సాగుతోంది. ఇప్పటికే చిత్రం ఏపి, తెలంగాణల్లో రూ.9.52 కోట్లు వసూలు చేసి ఘన విజయం దిశగా దూసుకుపోతోంది. ఈ దీంతో పివి, మ్యాటనీ సంస్థలు హ్యాట్రిక్ హిట్లందుకున్నట్లైంది.

 
Like us on Facebook