కొద్దిరోజులుగా జయలలిత బియోపిక్స్ గురించి మాధ్యమాలలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. దాదాపు ఐదారు చిత్రాలు ఆమె జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్నాయి. ఐతే వాటిలో ప్రముఖంగా కంగనా నటిస్తున్న తలైవా, నిత్యామీనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘ఐరన్ లేడీ’ ఉన్నాయి. వీటితో పాటు ఓ వెబ్ సిరీస్ కూడా ఆమె బయో పిక్ గా నిర్మితమవుతుంది. అదే ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ తెరకెక్కిస్తున్న క్వీన్. ఈ వెబ్ సిరీస్ కి ఉన్న మరో ప్రత్యేకత రమ్య కృష్ణ ..జయలలితగా నటిస్తున్నారు. దీనితో ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి.
జయలలిత బాల్యం నుండి ఆమె మరణించినంత వరకు జరిగిన విషయాలను కేవలం రెండు, మూడు గంటల సినిమాలో చెప్పలేమనే ఉద్దేశంతో ఆయన ఈ వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా నేడు క్వీన్ వెబ్ సిరీస్ కి సంబంధించిన ప్రోమో వీడియో విడుదల చేశారు. ఈనెల 5న దీనికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేయనున్నట్టు చెప్పడం జరిగింది. ఇప్పటివరకు జయలలితగా రమ్యకృష్ణ పూర్తి లుక్ విడుదల చేయలేదు. ట్రైలర్ లో జయలలిత గెటప్ లో రమ్యకృష్ణ ఎలా ఉంటారో చూసే అవకాశం కలదు.
State Topper. Superstar Heroine. Youngest Chief Minister.
A gripping story of the QUEEN awaits you! #QueenIsComing@meramyakrishnan @menongautham @Murugesanprasad#Queen #MXOriginalSeries #MXPlayer #Ace2Three #FanFight pic.twitter.com/w8km3L2dWu— Amazon MX Player (@MXPlayer) December 1, 2019
