ఏపీ లో టికెట్ ధరల సమస్య పై ఆర్.నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు!

Published on Dec 27, 2021 7:38 pm IST


ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో టికెట్ ధరల సమస్య పై ఆర్.నారాయణ మూర్తి కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. తాజాగా నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ చిత్రం సక్సస్ మీట్ కి ఆర్.నారాయణ మూర్తి హాజరు అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడటం జరిగింది.

ఈ మేరకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చాలా ధియేటర్లు మూత పడ్డాయని తెలిసి బాధ పడ్డాను అని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ తన నిర్ణయాన్ని పునరాలోచించాలి అని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో మూత పడిన థియేటర్ల ను తిరిగి తెరవాలి అని అన్నారు. సినీ పరిశ్రమ కి చెందిన వారు మరియు మా కూడా సీఎం ను కలిసి వీలైన త్వరగా సమస్యను పరిష్కరించాలి అని, థియేటర్ల ను మూసి వేయొద్దు అంటూ యాజమాన్యాలను కోరడం జరిగింది.

సంబంధిత సమాచారం :