“రా రా రక్కమ్మ” వీడియో సాంగ్ రిలీజ్ కి రెడీ!

“రా రా రక్కమ్మ” వీడియో సాంగ్ రిలీజ్ కి రెడీ!

Published on Aug 10, 2022 6:16 PM IST

కిచ్చా సుదీప్ హీరోగా అనూప్ బండారి దర్శకత్వం లో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రాంత్ రోణ. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీ గా విడుదల అయ్యి అన్ని చోట్ల సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ చిత్రం లో లేడీ లీడ్ లో నటించిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ రా రా రక్కమ్మ సాంగ్ తో యూత్ ను విశేషం గా ఆకట్టుకుంది.

ఈ పాటను ఆగస్ట్ 12, 2022 న సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఒక పోస్టర్ ద్వారా వెల్లడించడం జరిగింది. థియేటర్ల లో ఈ సాంగ్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం మాత్రమే కాకుండా, డిస్ట్రిబ్యూటర్ లకి లాభాలను తీసుకు వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు