స‌క్స‌స్ మీట్ లో.. ‘రాగ‌ల 24 గంట‌ల్లో’ !

Published on Nov 24, 2019 6:51 pm IST

సత్యదేవ్‌, ఈషారెబ్బా, శ్రీరాం, గణేష్‌ వెంకట్రామన్‌, ముస్కాన్‌ సేథీ ముఖ్య పాత్రదారులుగా నటించిన చిత్రం ‘రాగల 24 గంటల్లో’. ఈ చిత్రాన్ని ఢ‌మ‌రుకం ఫేమ్ శ్రీనివాస‌రెడ్డి తెర‌కెక్కించారు. శ్రీ కార్తికేయ సెల్యూలాయిడ్స్‌ సమర్పణలో శ్రీ నవహాస్‌ క్రియేషన్స్‌ బానర్‌ పై శ్రీనివాస్ కానూరి ఈ సినిమాని నిర్మించారు. వైవిధ్య‌మైన క‌థాంశంతో రూపొందిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్ ఇటీవ‌ల రిలీజైంది. రోజురోజుకు పెరుగుతోన్న ఆద‌ర‌ణ‌తో స‌క్స‌స్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్ లో రాగ‌ల 24 గంట‌ల్లో టీమ్ స‌క్స‌స్ మీట్ ఏర్పాటు చేసింది.

ఈ వేడుక‌లో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ… ఈ చిత్రాన్ని అద్భుతంగా రీసీవ్ చేసుకున్న ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే న‌మ్మారో అదే జ‌రిగింది. స్టోరీ, ప‌ర్ ఫెర్మాన్స్, అంజిగారి కెమెరా వ‌ర్క్, ర‌ఘు కుంచె మ్యూజిక్, మంచి క్వాలీటీతో రాజీప‌డ‌కుండా మా నిర్మాత శ్రీనివాస్ గారు ఈ సినిమాని నిర్మించ‌డం… ఇవ‌న్నీ ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడానికి కార‌ణం. ఈషా రెబ్బా అద్భుతంగా న‌టించింది. ఈ సంద‌ర్భంగా ఈషాకు కంగ్రాట్స్ చెబుతున్నాను. న‌న్ను న‌మ్మి నాకు ఈ సినిమాలో న‌టించే ఛాన్స్ ఇచ్చినందుకు ప్రొడ్యూస‌ర్ గార్కి, డైరెక్ట‌ర్ గార్కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. అంద‌రూ బాగా న‌టించారు. ఈ సినిమాని ప్రేక్ష‌కుల ద‌గ్గ‌ర‌కి చేర్చ‌డంలో కీల‌క పాత్ర పోషించిన మా పీఆర్వోస్ వంశీ – శేఖ‌ర్ కి థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ సినిమాని చూడ‌ని వాళ్లు త‌ప్ప‌కుండా థియేట‌ర్ లో చూడండి అన్నారు.

సంగీత ద‌ర్శ‌కుడు ర‌ఘు కుంచె మాట్లాడుతూ… ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ప్రేక్ష‌కులు థియేట‌ర్స్ కి ర‌ప్పించాలంటే చాలా క‌ష్టం. అయితే.. మంచి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారు. థియేట‌ర్ లో కూర్చొని సినిమా చూస్తే… ఆ కిక్కే వేర‌ప్పా. ఈ సినిమాని చూసిన ప్రేక్ష‌కులు సినిమా బాగుంది అని ప‌ది మందికి చెబుతున్నారు. మంచి రివ్యూస్ వ‌చ్చాయి. బ్యాగ్రౌండ్ స్కోర్, ఎడిటింగ్… ఇలా అన్ని డిపార్టెమెంట్స్ గురించి రాసారు. రివ్యూస్ చూసి చాలా హ్యాపీగా ఫీల‌య్యాను. అంద‌రూ థియేట‌ర్ లో చూడాల‌ని కోరుతున్నాను అన్నారు.

హీరోయిన్ ముస్కాన్ మాట్లాడుతూ… ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం రావ‌డం అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో మేఘ‌న క్యారెక్ట‌ర్ చేసాను. కెమెరామ‌న్ అంజిగారు న‌న్ను మ‌రింత అందంగా చూపించినందుకు థ్యాంక్స్. స‌త్య‌దేవ్, ఈషా, ర‌ఘు గారి మ్యూజిక్, ఎడిటింగ్… ఇలా అన్నీ బాగా కుదిరాయి. ప్ర‌తి ఒక్క‌రు బాగా క‌ష్ట‌ప‌డ్డారు. అందుకే ఈ స‌క్స‌స్ వ‌చ్చింది అన్నారు.

నిర్మాత శ్రీనివాస్ కానూరి మాట్లాడుతూ… డిస్ట్రిబ్యూట‌ర్స్ నుంచి సినిమా బాగుంది. క‌లెక్ష‌న్స్ బాగున్నాయి అని మెసేజ్ లు రావ‌డంతో చాలా సంతోషంగా ఉంది. మంచి సినిమాని ఇచ్చిన శ్రీనివాస్ అన్న‌య్య‌కి థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను. కొంత మంది నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు కూడా సినిమా బాగుంది అని అభినందించారు. రాఘ‌వేంద్ర‌రావు గారు ఫోన్ చేసి… శ్రీనివాస‌రెడ్డి థ్రిల్ల‌ర్ మూవీని ఎలా తీస్తాడో అనుకున్నాను. చాలా గ్రిప్పింగా తీసాడు బాగుంది అని అభినందించ‌డం మ‌ర‌చిపోలేని అనుభూతి. సినిమా బాగుంది అని సి.ఎం ఆఫీస్ నుంచి కూడా మెసేజ్ వ‌చ్చింది. ఇంత మంది ఇలా అభినందిస్తుంటే… నా ఆనందానికి అవ‌ధులు లేవు. ఈషా, స‌త్య వీరిద్ద‌రు తెలుగువాళ్లు. తెలుగు న‌టీన‌టుల‌తో ఈ సినిమా చేయ‌డం.. అది ఈ విధంగా విజ‌యం సాధించ‌డం… ఈ సంద‌ర్భంగా ప్రేక్ష‌కుల‌కు థ్యాంక్స్ తెలియ‌చేస్తున్నాను.

డైరెక్ట‌ర్ శ్రీనివాస‌రెడ్డి మాట్లాడుతూ…. ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో త‌ర్వాత కొంత నిరాశ‌కులోన‌య్యాం. శ‌నివారం మార్నింగ్ షో, మ్యాట్నీ షోలు హౌస్ ఫుల్ అవ్వ‌డం.. అన్ని చోట్లా క‌లెక్ష‌న్స్ బాగుండ‌డంతో చాలా హ్యాపీగా ఫీల‌య్యాం. ఈ సినిమా చూసిన వాళ్లు బాగుంది చూడండి అని ఓ ప‌ది మందికి చెబుతున్నారు. ముఖ్యంగా ఈ సినిమా చూసిన వాళ్లు స‌త్య‌, ఈషా న‌ట‌న గురించి ప్ర‌త్యేకించి మాట్లాడుతున్నారు. స‌త్య సినిమా ఇండ‌స్ట్రీకి ఓ వ‌రం. ఫ్యూచ‌ర్ లో మ‌రిన్ని మంచి పాత్ర‌లు అత‌నికి వ‌స్తాయి. ఈషా అందంతో పాటు అభిన‌యంతో పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా న‌టించి ఆక‌ట్టుకుంది. నేను ఏదైతే న‌మ్మి ఈ సినిమా తీసానో అది నిజం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాకి రియ‌ల్ హీరో మా ప్రొడ్యూస‌రే. ద‌మ్మున్న నిర్మాత‌. క్వాలీటీ విష‌యంలో ఎక్క‌డా రాజీప‌డ‌కుండా ఈ మూవీని నిర్మించారు. 300 స్క్రీన్స్ లో ఈ సినిమాని రిలీజ్ చేసాం. పెద్ద సినిమాకి ఎలాగైతే ప‌బ్లిసిటీ చేస్తారో అలా చేసాం. బుధ‌వారం నుంచి స‌క్స‌స్ టూర్ ప్లాన్ చేస్తున్నాం. వైజాగ్ నుంచి ప్రారంభ‌మ‌య్యే ఈ టూర్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో పాటు తెలంగాణ‌లో ఈ సినిమా ప్ర‌ద‌ర్శిస్తున్న అన్ని థియేట‌ర్స్ కి వెళ్లి ప్రేక్ష‌కుల‌ను క‌లుస్తాం. ర‌ఘు మ్యూజిక్, అంజి కెమారావ‌ర్క్ ఈ సినిమాకి ప్రాణం పోసాయి. కృష్ణ‌భ‌గ‌వాన్ డైలాగ్స్ సినిమా విజ‌యానికి హెల్ప్ అయ్యాయి. ఓ మంచి సినిమా తీసాన‌నే తృప్తి క‌లిగించింది.

సంబంధిత సమాచారం :

X
More