రాకాస సర్‌ప్రైజ్.. సీక్వెల్ కూడా ఉందిగా..!

Raakaasaa

మెగా డాటర్ నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించిన లేటెస్ట్ ఫిల్మ్ ‘రాకాస’. సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించిన ఈ చిత్రంతో మానస శర్మ దర్శకురాలిగా వెండితెరకు పరిచయమైంది. ఫాంటసీ హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ చిత్రంలోని కామెడీ వర్కవుట్ కావడంతో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం బుక్‌మై షోలో కూడా ఈ సినిమా ట్రెండింగ్‌లో ఉండటం విశేషం.

ఈ సినిమా క్లైమాక్స్‌లో మేకర్స్ ఒక ఆసక్తికరమైన సర్‌ప్రైజ్ ఇచ్చారు. కథ ముగింపులో ‘రాకాస 2’ అంటూ సీక్వెల్‌ను ప్రకటించి ప్రేక్షకులలో క్యూరియాసిటీ పెంచేశారు. అయితే ఈ రెండో భాగానికి సంబంధించిన కథాంశం లేదా షూటింగ్ వివరాలను ప్రస్తుతానికి వెల్లడించలేదు. ఈ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.

త్వరలో నిర్వహించబోయే సినిమా సక్సెస్ మీట్‌లో సీక్వెల్‌కు సంబంధించిన అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉంది. వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి వంటి భారీ తారాగణం నటించిన ఈ చిత్రానికి అనుదీప్ దేవ్ సంగీతం అందించాడు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు జీ స్టూడియోస్ సంయుక్తంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించాయి.

Exit mobile version