అవకాశం ఇస్తే ప్రూవ్ చేసుకుంటామంటున్న ఢిల్లీ బ్యూటీ

Rashi-Khanna

యంగ్ హీరో నాగ శౌర్య హీరోగా వచ్చిన ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఢిల్లీ ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈ సినిమాతో మంచి మార్కులు కొట్టేసిన ఈ భామ ఆ తర్వాత చేసిన జోరు మరియు జిల్ సినిమాలతో కూడా ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఈ భామ రవితేజ సరసన బెంగాల్ టైగర్ మరియు రామ్ సరసన శివం సినిమాల్లో నటిస్తోంది.

ఇది పక్కన పెడితే టాలీవుడ్ అంటే హీరో డామినేషన్ ఉన్న ఇండస్ట్రీ అని, హీరోయిన్స్ కేవలం గ్లామర్ కి మాత్రమే పరిమితం అని అంటుంటారు. ఇదే విషయాన్ని ఈ యంగ్ బ్యూటీ ముందు ఉంచితే ‘మేము కేవలం ఆడి పాడటానికి మాత్రమే అంటే ఒప్పుకోను, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వాల్సిందే.. హీరో కి ప్రాధాన్యం ఉన్న ఇండస్ట్రీ అయినా టాలీవుడ్ లో హీరోయిన్ కి ప్రాధాన్యం ఉన్న సినిమాలు రావడం లేదు అనడం అవాస్తవం. నాకు ప్రతి సినిమాలోనూ నటనకి ప్రాధాన్యం ఉన్న పాత్రలే దక్కాయి కదా’ అని అంటోంది.

Exit mobile version