తన లవ్లీ డైరెక్టర్ కోసం గెస్ట్ రోల్ చేయనున్న రాశీ ఖన్నా !


ఒకవైపు ఎన్టీఆర్ సరసన ‘జై లవ కుశ’ వంటి పెద్ద సినిమాలో నటించి మరోవైపు మాస్ మహారాజ రవితేజతో ‘టచ్ చేసి చూడు’, మెగాహీరో వరుణ్ తేజ్ తో ఒక రొమాంటిక్ ఎంటర్టైనర్లోను, తమిళం, మళయాళంలలో ఒక్కో ప్రాజెక్ట్ చేస్తూ బిజీగా ఉన్న హీరోయిన్ రాశీ ఖన్నా గెస్ట్ రోల్స్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు.

దర్శకుడు అనిల్ రావుపూడి రవితేజతో చేస్తున్న ‘రాజా ది గ్రేట్’ సినిమాలో రాశీ ఖన్నా కొద్దిసేపు మెరవనుంది. ఈ విషయాన్ని ఆమే తన పేస్ బుక్ ద్వారా స్వయంగా తెలిపారు. తన అభిమాన దర్శకుడు అనిల్ రావిపూడి కోసం రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ, మెహ్రీన్ కౌర్ కలిసి చేస్తున్న పాటలో కాసేపు స్పెషల్ అప్పియరెన్స్ ఇవ్వనున్నానని అన్నారు. రాశీ ఖన్నా కెరీర్లో చెప్పుకోదగిన హిట్లలో అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ‘సుప్రీమ్’ ఒకటి. ఈ అనుభంధంతోనే రాశీ ఖన్నా అనిల్ సినిమాలో అతిధి పాటర్ చేసేందుకు ఒప్పుకున్నారు.