‘మనీ హెయిస్ట్’ ఫైనల్స్ పై రాశీ ఖన్నా ఎగ్జైట్మెంట్.!

Published on Dec 5, 2021 9:00 am IST

ప్రపంచ వ్యాప్తంగా కూడా ఓటిటి వీక్షకులు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్న ది మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “మనీ హెయిస్ట్”. దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ లో ఇటీవల స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ గ్లోబల్ హిట్ వెబ్ సిరీస్ మొన్న డిసెంబర్ 3న చిట్టచివరి సీజన్లో వాల్యూమ్ 2 ని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చి ఒక ముగింపు ఇచ్చింది.

అయితే మన స్టార్ నటుల్లో కూడా దీనికి ఫ్యాన్స్ ఉన్నారు. మరి వీరిలో గ్లామరస్ స్టార్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఉన్నట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. ఈ ఫైనల్ చాప్టర్ ని తాను కూడా కంప్లీట్ చేసినట్టు ఉంది అందుకే ఓ పోస్ట్ కూడా పెట్టగా అది వైరల్ అవుతుంది.

ఎంత ఎమోషన్స్ తో కూడిన రోలర్ కాస్టర్ లా ఉంది మనీ హెయిస్ట్ ఫైనల్స్ అంటూ తన ఎగ్జైట్మెంట్ తో కూడిన రెస్పాన్స్ ని అందించింది. అంటే ఈ గ్యాప్ లో తాను కూడా ఈ సీజన్ ని కంప్లీట్ చేసేసింది అని చెప్పాలి. ప్రస్తుతం అయితే రాశీ పలు టాలీవుడ్ మరియు కోలీవుడ్ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది.

సంబంధిత సమాచారం :