ఆ వార్తలన్నీ ఆపండి – వివాదంపై రాశీ ఖన్నా క్లారిటీ.!

Published on Apr 6, 2022 2:00 pm IST

టాలీవుడ్ కి చెందినటువంటి స్టార్ హీరోయిన్స్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ రాశీ ఖన్నా కూడా ఒకరు. అయితే రాశీ ఖన్నా ఇటీవల బాలీవుడ్ లోకి కూడా అడుగు పెట్టింది. కానీ అనూహ్యంగా ఈమె సౌత్ ఇండియా సినిమా కోసం అలాగే తెలుగు సినిమాపై చేసిన కొన్ని సంచలన కామెంట్స్ పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి. ఇక్కడ హీరోయిన్స్ కి ఎలాంటి స్థానం ఉంటుంది.

ఆమె ఇక్కడ సినిమాలు నటిని కూడా అని మర్చిపోయానని చేసిన కామెంట్స్ కొన్ని అభ్యంతరకరంగా మారాయి. మరి ఈ వివాదాలు అన్నింటిపై రాశిఖన్నా లేటెస్ట్ గా ఓ పోస్ట్ పెట్టి క్లారిటీ ఇచ్చింది. నేను సౌత్ ఇండియా సినిమాపై కొన్ని మాటలు అన్నట్టుగా అనేక వార్తలు ప్రచారం ప్రచారం జరుగుతున్నాయని అవన్నీ ఎవరైతే చేస్తున్నారో దయచేసి ఆ వార్తలన్నీ ఆపండి నాకు ప్రతి భాష పట్ల సినిమాల పట్ల గౌరవం ఉందని ఇందులో తెలియజేసింది. దీనితో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

సంబంధిత సమాచారం :