మరొకసారి సూపర్ స్టార్ పై తన అభిమానాన్ని చాటుకున్న రాశి ఖన్నా

Published on Feb 16, 2023 2:12 am IST


టాలీవుడ్ లో ప్రస్తుతం యువ నటిగా మంచి అవకాశాలతో పలు సక్సెస్ లతో నటిగా ఆడియన్స్ ని అలరిస్తూ దూసుకెళ్తున్న వారిలో రాశి ఖన్నా కూడా ఒకరు. తొలిసారిగా మనం మూవీలోని క్యామియో అపీయరెన్స్ ద్వారా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన రాశి ఖాన్నా, దాని అనంతరం శ్రీనివాస్ అవసరాల తెరకెక్కించిన ఊహలు గుసగుసలాడే మూవీ ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. అక్కడి నుండి అనేక సక్సెస్ఫుల్ సినిమాల్లో నటించి ఆడియన్స్ ని ఆమె అలరించారు. ఇక ఇటీవల వెబ్ షో ఫర్జి ద్వారా ఆడియన్స్ ముందుకి వచ్చారు రాశి ఖన్నా. ఇటీవల ప్రముఖ ఒటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ షోకి అందరి నుండి ప్రస్తుతం సూపర్ రెస్పాన్స్ లభిస్తోంది.

ఇందులో షాహిద్ కపూర్, విజయ్ సేతుపతి, రాశి ఖన్నా, కేకే మీనన్, భువన్ అరోరా వంటి వారు కీలక పాత్రలు చేసారు. ఇక ఈ సిరీస్ లో మేఘ వ్యాస్ అనే పోలీస్ అధికారి పాత్రలో కనిపించి తన ఆకట్టుకునే అందం, అభినయంతో అలరించారు రాశి. ఈ షో సక్సెస్ సందర్భంగా నేడు తన సోషల్ మీడియా మాధ్యమం ఇన్స్టాగ్రామ్ ద్వారా ఫ్యాన్స్ తో వీడియో చాటింగ్ లో రాశి ఖన్నా మాట్లాడుతూ, ఫర్జీ ని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ఆడియన్స్ కి ఫ్యాన్స్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. మీరు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఎప్పుడు సినిమా చేస్తారు అంటూ ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు ఈ విధంగా బదులిచ్చారు రాశి.

తాను సూపర్ స్టార్ మహేష్ బాబు కి ఎంతో పెద్ద అభిమానినని మొదటి నుండి ఎన్నో సందర్భాల్లో తెలిపానని అన్నారు. ఇటీవల ఒకసారి మహేష్, నమ్రత గార్లని కలిసిన సందర్భం ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు. ఇక సూపర్ స్టార్ తో సినిమా చేసేందుకు తాను కూడా ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నానని, తప్పకుండా దేవుడి దయవలన త్వరలోనే ఆ అవకాశం వస్తుందని ఆశిస్తున్నానని, అలానే తామిద్దరి పెయిర్ బాగుంటుందని చెప్పుకొచ్చారు. మొత్తంగా మరొకసారి సూపర్ స్టార్ పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు రాశి ఖన్నా.

సంబంధిత సమాచారం :