మరోసారి గాయనిగా మారిన రాశి ఖన్నా !


ప్రస్తుత స్టార్ హీరోయిన్లలో ఒకరైన రాశి ఖన్నాకు నటన మాత్రమే కాకుండా పాడటం మీద కూడా అమితాసక్తి ఉంది. అందుకే ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుంటుందా టాలెంట్ చూపిద్దామా అని ఎదురుచూస్తుంటుందామె. ఆ తపనకి తోడు ఆమె గాత్రం కూడా బాగుండటంతో అడపాదడపా పాడే అవకాశాలు వస్తూనే ఉన్నాయి.

మొదటగా తన చిత్రం ‘జోరు’ లో ఒక పాట పడిన ఆమె ఆ తర్వాత తన మలయాళ డెబ్యూట్ సినిమా ‘విలన్’ కోసం గొంతు సవరించుకుని ఇప్పుడు నారా రోహిత్ నటిస్తున్న, ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ సంగీతం అందిస్తున్న ‘బాలకృష్ణుడు’ సినిమాకు పాడింది. ఇక్కడ విశేషమేమిటంటే ఇందులో హీరోయిన్ ఆమె కాదు రెజినా.