రవితేజ సరసన రాశి ఖన్నా ?

Published on Oct 1, 2023 7:43 pm IST

మాస్ మహారాజా రవితేజ హీరోగా ప్రస్తుతం టైగర్ నాగేశ్వర రావు మూవీ తెరకెక్కుతోంది. అయితే, గతంలో తనతో డాన్ శ్రీను, బలుపు, క్రాక్ వంటి సక్సెస్ ఫుల్ సినిమాలు తీసి మంచి హిట్స్ అందించిన గోపీచంద్ మలినేనితో రవితేజ మరొక మూవీ చేయడానికి సిద్ధం అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాలో సెకండ్ హీరోయిన్ గురించి ఇప్పుడు ఓ సరికొత్త రూమర్ వైరల్ అవుతుంది. రవితేజ కి జోడీగా రాశి ఖన్నా ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందట. ఇప్పటివరకు ఈ వార్త పై అధికారక ప్రకటన అయితే రాలేదు.

మరి రవితేజ సినిమాలో రాశి ఖన్నా నటిస్తోందేమో చూడాలి. ఇక ఈ మూవీని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ వారు గ్రాండ్ లెవెల్లో నిర్మించనున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ యొక్క పూర్తి వివరాల అనౌన్స్ మెంట్ త్వరలో రానున్నట్లు తెలుస్తోంది. అలాగే రవితేజ, కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో మరొక మూవీ ఈగిల్ ను కూడా చేస్తున్నారు. ఈ మూవీ రానున్న 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుందని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :