డాన్స్ టీచర్ గా మారిన రాశీఖన్నా !

10th, December 2017 - 01:38:21 PM

వరుసగా పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ స్టార్ హీరోయిన్ల జాబితాలో చేరిపోయిన నటి రాశీఖన్నా ప్రస్తుతం రవితేజ చేస్తున్న ‘టచ్ చేసి చూడు’ చిత్రంలో నటిస్తోంది. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ఇప్పుడు దుబాయ్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో రాశీఖన్నా వెస్ట్రన్ డాన్స్ టీచర్ గా కనిపించనుందట.

అంతేగాక ఆమె పాత్రలో చాలా ఫన్ ఉంటుందని, ఆమెపై కీలకమైన ఎంటర్టైనింగ్ సన్నివేశాలను చిత్రీకరించడం జరిగిందని చిత్ర యూనిట్ చెప్తున్నారు. విక్రమ్ సిరికొండ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మరొక హీరోయిన్ శీరత్ కపూర్ కూడా నటిస్తోంది. నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.