రేపు ధనుష్ “రాయన్” నుండి థర్డ్ సింగిల్ రిలీజ్!

రేపు ధనుష్ “రాయన్” నుండి థర్డ్ సింగిల్ రిలీజ్!

Published on Jul 4, 2024 10:30 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. చివరిసారిగా కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కనిపించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. ప్రస్తుతం టాలీవుడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న కుబేర చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ధనుష్ 50 వ చిత్రం రాయన్ జూలై 26 వ తేదీన రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. రేపు ఈ చిత్రం నుండి థర్డ్ సింగిల్ అయిన రాయన్ రంబుల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. ఇదే విషయాన్ని సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ధనుష్ దర్శకత్వంలో తెరకెక్కిన రాయన్ చిత్రం తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్రంలో ఎస్.జే. సూర్య, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, సెల్వరాఘవన్, ప్రకాష్ రాజ్, దుషార విజయన్, అపర్ణా బాలమురళి మరియు వరలక్ష్మి శరత్‌కుమార్‌, తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సన్ పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తున్న ఈ చిత్రానికి AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు