ఆకట్టుకుంటున్న రష్మీ, నందుల సాంగ్ !

Published on Oct 19, 2020 10:41 am IST

హీరోగా నిలబడటానికి ‘నందు’ మళ్ళీ మరో సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సన్నద్దం అవుతున్నాడు. ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ రష్మితో వస్తోన్న నందు ఈ సారైనా బాక్సాఫీస్ వద్ద నిలబడతాడేమో చూడాలి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ‘రాయే నువ్ రాయే’ అనే పాట చిత్రబృందం విడుదల చేసింది. సాంగ్ లో రష్మీ – నందుల మధ్య కెమిస్ట్రీని బాగా ఎలివేట్ చేశారు.

ఇక ఈ సినిమా టీజర్ కూడా బాగానే క్లిక్ అవ్వడం.. పైగా టీజర్ లో రష్మీ, నందుల కెమిస్ట్రీ హైలైట్ అవ్వడంతో.. ఓవరాల్ గా టీజర్ నెటిజన్లకు పర్వాలేదు అనిపించింది. వాణి పాత్రలో రష్మీ, పోతురాజు క్యారెక్టర్‌లో నందు జీవించేశారనే స్థాయిలో తమ పాత్రల్లోకి లీనం అయిపోయారు. అయితే వాణి పాత్ర.. రష్మీకి మంచి పేరు తెచ్చిపెట్టేలా ఉంది. పైగా ‘గొడవలంటే చాలా ఇష్టమండి’ అంటూ వయ్యారంగా రష్మి పలికిన డైలాగ్ కూడా బాగానే పేలింది.

సాంగ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సంబంధిత సమాచారం :

More