ప్రభాస్ కెరీర్ లో మరో గుర్తుండిపోయే ఆల్బమ్ గా “రాధే శ్యామ్”

Published on Jul 18, 2021 9:54 am IST

ప్రతీ హీరోకి తన కెరీర్ లో ఒక ఎవర్ గ్రీన్ మ్యూజిక్ ఆల్బమ్ ఉంటుంది. అలాగే వాటి సంఖ్య కూడా కాస్త ఎక్కువ ఉండొచ్చు. కానీ వాటి స్థానాలు రీప్లేస్ చెయ్యడం అనేది కష్టమే.. అందుకే మిగతా సినిమా సంగీత దర్శకులు తమ బెస్ట్ ఇవ్వడానికే ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక కథ డిమాండ్ చేస్తే ఆటోమేటిక్ గా అలాంటి సాంగ్స్ వచ్చి పడతాయి.అలాంటి సినిమా ప్రభాస్ కెరీర్ లో ఏదన్నా ఉంది గుక్క తిప్పుకోకుండా “డార్లింగ్” సినిమానే అని చెప్తారు అంతా.

మరి ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లో చాలా కాలం అనంతరం వస్తున్న ఒక అపురూపమైన లవ్ స్టోరీ చిత్రమే “రాధే శ్యామ్”. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ పాన్ ఇండియన్ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నాడు. తెలుగు, తమిళ్,తమిళ్ సహా మిగతా దక్షిణాది ఆల్బమ్స్ కి తానే సంగీతం అందిస్తున్నాడు.

అయితే ఈ సినిమా ఆల్బమ్ కూడా ప్రభాస్ కెరీర్ లో ఒక అపురూపమైన ఆల్బమ్ గా గుర్తుండిపోయేలా ఇవ్వడానికి ప్రయత్నించానని జస్టిన్ తెలుపుతున్నాడు. ఇప్పటికే మోషన్ పోస్టర్ టీజర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో మ్యాజిక్ చేసిన జస్టిన్ ఖచ్చితంగా ఆల్బమ్ కూడా అంతా ప్రామిసింగ్ గా ఇస్తాడని నమ్మకంగా ఉన్నారు. మరి ఈ సినిమా నుంచి మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ ఎప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :