అక్కడ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయ్యిన “రాధే శ్యామ్” రన్.!

Published on Mar 22, 2022 10:00 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాధా కృష్ణకుమార్ తెరకెక్కించిన ఈ భారీ పాన్ ఇండియా సినిమా ఇప్పుడు ఆల్ మోస్ట్ థియేటర్స్ లో రన్ ని కంప్లీట్ చేసుకోనుంది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమా ఓవర్సీస్ లో మంచి ప్రీమియర్స్ నంబర్స్ ని నమోదు చేసి ఓపెనింగ్స్ కూడా బాగానే అందుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఇప్పుడు యూఎస్ఏ లో ఈ సినిమా తాలూకా థియేట్రికల్ రన్ కంప్లీట్ అయ్యినట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా యూఎస్ లో దాదాపు 2.04 మిలియన్ డాలర్స్ తో రన్ ని పూర్తి చేసుకుందట. అయితే ఈ సినిమాకి జరిగిన బిజినెస్ లో ఎంతమేర రాబట్టిందో తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా యూవీ క్రియేషన్స్ వారు నిర్మాణం వహించారు

సంబంధిత సమాచారం :