“రాధే శ్యామ్” కూడా క్లారిటీ..వెనకడుగు లేదు.!

Published on Nov 19, 2021 3:37 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ సినిమా “రాధే శ్యామ్”. పాన్ ఇండియన్ లెవెల్లో మంచి అంచనాలు ఉన్న ఈ సినిమా నుంచి ఇప్పుడు ఆసక్తికర అప్డేట్స్ వస్తున్నాయి. ఎలాగో సినిమా రిలీజ్ కి తక్కువ సమయమే ఉంది.

కానీ మధ్యలో మళ్ళీ ఎన్నో మార్పులు ఈ సమయంలోనే సంక్రాంతి రేస్ లో ఉన్న సినిమాలు రిలీజ్ ఎలా ఉండబోతుంది అనే ప్రశ్న రసవత్తరంగా మారింది. అయితే రాధే శ్యామ్ డేట్ పై కూడా కొందరు అనుమాన పడ్డారు కానీ చిత్ర యూనిట్ మాత్రం అదే రిలీజ్ డేట్ కి స్టిక్ అయ్యి ఉన్నటు క్లారిటీ ఇచ్చారు.

లేటెస్ట్ పోస్టర్ లో కూడా రిలీజ్ డేట్ ని పెట్టడంతో ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. సో రాధే శ్యామ్ కూడా సంక్రాంతి రేస్ లో వెనకడుగు వేసేది లేదు అని అర్ధం అవుతుంది. ప్రస్తుతం అయితే అంతా ఈ సినిమా ఫస్ట్ సింగిల్ తో ఎంజాయ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More