రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ సినిమాలకి బంఫర్ ఆఫర్..!

Published on Mar 8, 2022 2:00 am IST


ఏపీలో సినిమా టిక్కెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం కొత్త జీవోను విడుదల చేసింది. అయితే ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని తాజా జీవోపై మాట్లాడుతూ అన్ని విషయాలను క్లుప్తంగా తెలియచేశారు. ఇకపై హీరో, డైరెక్టర్ రెమ్యునరేషన్ కాకుండా రూ.100 కోట్ల బడ్జెట్ దాటిన సినిమాలకు కనీసం 10 రోజుల పాటు రేట్లు పెంచుకునేలా అవకాశం ఇస్తున్నామని, కానీ 20 శాతం షూటింగ్ ఏపీలో చేసిన సినిమాలకు మాత్రమే రేట్ల పెంపు వర్తిస్తుందని పేర్కొన్నాడు.

అయితే ప్రస్తుతం రిలీజ్‌కి సిద్దంగా ఉన్న రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ చిత్రాలు ఏపీలో 20% షూటింగ్ జరుపుకోనప్పటికీ ఈ రెండు చిత్రాలకు మొదటి 10 రోజుల పాటు టిక్కెట్ ధరలను పెంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నామని, అలాగే ఈ రెండు సినిమాలకు ఐదో షో కి కూడా అనుమతి ఇస్తున్నట్టు మంత్రి పేర్ని నాని తెలిపాడు. ఇకపై వచ్చే సినిమాలు 20% ఏపీలో ఖచ్చితంగా షూటింగ్ చేస్తేనే కొత్త జీవోలోని నియమ నిబంధనలు వర్తిస్తాయని అన్నాడు.

సంబంధిత సమాచారం :