ఇంట్రెస్టింగ్ అండ్ మైండ్ బ్లోయింగ్ గా “రాధే శ్యామ్” కర్టెన్ రైజర్.!

Published on Mar 2, 2022 3:11 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు తో తెరకెక్కించిన ఈ భారీ సినిమా రిలీజ్ ఇంకొన్ని రోజుల్లో ఉండడంతో అభిమానులు చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు.

మరి లేటెస్ట్ గా అయితే ఈ చిత్రం నుంచి రెండో ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ అన్నట్టుగా ఒకదాన్ని రిలీజ్ చేస్తామని ప్రకటించారు. కానీ తర్వాత సినిమాకి సంబంధించి 1 నిమిషం 3 సెకండ్లు ఉండే ఇంట్రెస్టింగ్ క్లిప్ ని రివీల్ చేస్తున్నట్టు తెలిపారు. మరి అన్ని భాషల్లోనూ రిలీజ్ ఈ క్లిప్ అత్యంత ఆసక్తిగా ఉందని చెప్పాలి. ప్రభాస్ పాత్ర అసలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటుందో.

తాను చెప్పే హస్త సాముద్రికం ఏ రేంజ్ లో నిజమవుతుందో అన్నట్టుగా చూపించిన విజువల్స్ సాలిడ్ గా ఉన్నాయి. కానీ ఇదంత విధి తనకు తెలిసిన ప్రతిదీ కాగా ప్రేమ విషయానికి వచ్చేసరికి తన లెక్క తప్పుతుంది అన్నట్టు ప్రేరణ చెప్పడం మరింత ఆసక్తిగా ఉంది.

ఇక ఈ కర్టెన్ రైజర్ వీడియోలో గ్రాఫిక్స్ అయితే ఓ సరైన థియేటర్స్ లో చూస్తే మాత్రం మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స్ అందించేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి అయితే “రాధే శ్యామ్” పై అటు కంటెంట్ తోను ఇటు అదిరిపోయే విజువల్స్ తోను బాక్సాఫీస్ యుద్ధానికి గట్టి యుద్ధాన్నే ఈ ప్రేమ యుద్ధ కథా చిత్రం ప్రకటించినట్టు అనిపిస్తుంది. మరి ఈ మార్చ్ 11 న థియేటర్స్ లో బ్లాస్ట్ ఏ లెవెల్లో ఉంటుందో చూడాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :