రిలీజ్‌కి ముందే నైజాంలో “రాధేశ్యామ్” ఆల్‌టైమ్ రికార్డ్..!

Published on Mar 11, 2022 2:30 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన ఈ చిత్రం మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఇప్పటికే థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ సందడి మొదలైపోయింది.

ఇదిలా ఉంటే ఈ సినిమా రిలీజ్‌కి ముందే నైజాంలో ఆల్‌టైమ్ రికార్డ్ సెట్ చేసింది. హైదరాబాద్‌లో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ రూ.6.5 కోట్ల మార్క్ దాటింది. ఇది డే1 ఆల్‌టైమ్ రికార్డ్ అని చెప్పాలి. దీనిని బట్టి చూస్తుంటే రిలీజ్‌కి ముందే రాధేశ్యామ్ ఇలా రికార్డులు సాధిస్తుందంటే, రాబోయ్యే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను నెలకొల్పుతుందో చూడాలి మరీ.

సంబంధిత సమాచారం :