లేటెస్ట్.. “రాధే శ్యామ్” వాయిదా పై సాలిడ్ క్లారిటీ ఇచ్చిన దర్శకుడు.!

Published on Jan 4, 2022 12:00 pm IST

ప్రస్తుతం మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న భారీ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన చిత్రం “రాధే శ్యామ్” కూడా ఒకటి. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం ఇప్పటికీ కూడా రిలీజ్ పరంగా క్లారిటీగానే ఉంది. కానీ దేశంలో పరిస్థితులు ఇప్పుడు ఒక్కసారిగా మారిపోతుండడంతో ఈ సినిమా కూడా వాయిదా పడుతుంది అనేమో ఒక టెన్షన్ లో అయితే అభిమానులు ఉన్నారు.

మరి ఈ సమయంలో అంతా జాగ్రత్తగా ఉండాలని రాధా కృష్ణ సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ఇది కాస్తా పోస్ట్ పోన్ కి సంకేతం అన్నట్టుగా ఉందని ప్రశ్నలు మొదలయ్యాయి. మరి దీనిపై కూడా రాధా తన స్పందనను తెలియజేసాడు. అలాంటివి ఏమన్నా ఉంటే డైరెక్ట్ గానే చెబుతామని ఎలాంటి ఇన్ డైరెక్ట్ అనౌన్సమెంట్ ఇవ్వము ఆఫీషియల్ గానే చెబుతాం అని సాలిడ్ క్లారిటీ ఇచ్చాడు. దీనితో రాధే శ్యామ్ పోస్ట్ పోన్ విషయంలో ఒక క్లారిటీ అందరికీ వచ్చినట్టేగా..

సంబంధిత సమాచారం :