“రాధే శ్యామ్” రెండో ట్రైలర్ పై క్రేజీ అప్డేట్స్ ఇచ్చిన దర్శకుడు.!

Published on Feb 26, 2022 3:20 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాధాకృష్ణ తెరకెక్కించిన లేటెస్ట్ భారీ చిత్రం “రాధే శ్యామ్”. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ భారీ సినిమా రిలీజ్ కి గాను ఇప్పుడు కొన్ని రోజులు గ్యాప్ ఉండగా మేకర్స్ ప్రమోషన్స్ కి సిద్ధంగా ఉన్నారు. ఇక ఇప్పుడు దర్శకుడు రాధా కృష్ణ అయితే తన ట్విట్టర్ లో ఒక చాట్ సెషన్ ని అభిమానుల్లో నిర్వహించగా..

ఇందులో ఎక్కువగా తనకి రాధే శ్యామ్ రెండో ట్రైలర్ కి సంబంధించి అధిక ప్రశ్నలు ఎదురయ్యాయి. మరి దీనిపై తాను అదిరే క్లారిటీ ఇచ్చాడు. రాధే శ్యామ్ నుంచి రెండో ట్రైలర్ ఖచ్చితంగా ఉందని అలాగే ఈ ట్రైలర్ కి థమన్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో రిలీజ్ చేస్తున్నామని తాను క్లారిటీ ఇచ్చాడు. ఇంకా ఈ ట్రైలర్ లో ముందులా రిపీటెడ్ షాట్స్ లేకుండా ప్లాన్ చేస్తున్నామని క్లారిటీ ఇచ్చాడు. దీనితో ఈ ట్రైలర్ పై ఒక క్లారిటీ తో పాటుగా భారీ హైప్ ఒక్కసారిగా వచ్చాయి.

సంబంధిత సమాచారం :