తన “రాధే శ్యామ్” పై అద్భుతమైన పోస్ట్ పెట్టిన డైరెక్టర్ రాధా.!

Published on Mar 15, 2022 9:02 am IST


ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గ మిక్సిడ్ టాక్ తో కూడా బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్న భారీ సినిమా “రాధే శ్యామ్”. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించాడు.

అత్యంత గ్రాండ్ విజువల్స్ ఒక అద్భుతమైన ప్రేమకథని వెండితెరపై ఆవిష్కరించాడు. అయితే తన సినిమా టైటిల్ “రాధే శ్యామ్” తోనే ఓ అపురూపమైన ప్రేమకథాని అందిస్తున్నామని చెప్పిన డైరెక్టర్ ప్రేమికులని మాత్రం డెఫినెట్ గా మెప్పించాడు. మరి లేటెస్ట్ గా తాను పెట్టిన పోస్ట్ అయితే అద్భుతం గానే ఉందని చెప్పాలి.

ఆ రాధా కృష్ణుల ఫోటోని తన సినిమాలోని మెయిన్ లీడ్ ని సేమ్ స్టిల్ తో చూపించి తన విజన్ ని సినిమాలో ఏ విధంగా పోర్ ట్రే చేసాడో చూపించాడు. అంతే కాకుండా “ఉన్నంత కాలం భూమి ఆకాశం నిలిచేటి గాథే ఈ రాధే శ్యామ్” అని తన డైలాగ్ ని చెప్పుకొచ్చాడు. దీనితో ఈ ఆసక్తికర పోస్ట్ చేసి ప్రభాస్ మరియు మూవీ లవర్స్ మరింత ఎగ్జైటింగ్ గా ఫీల్ అవుతున్నారు.

సంబంధిత సమాచారం :