నెవర్ బిఫోర్ ప్లానింగ్ తో వస్తున్న “రాధే శ్యామ్”.!

Published on Dec 18, 2021 1:00 pm IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. భారీ అంచనాలు నెలకొల్పుకున్నా ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి ఇప్పుడు ఒక్కో సాంగ్ రిలీజ్ అవుతూ వస్తున్నాయి. ఇక మేకర్స్ ఈ సినిమాపై రెండు బిగ్ అప్డేట్స్ ని ఒకే రోజు ప్లాన్ చేశారు.

అదే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక మరియు సినిమా మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ లాంచ్. అయితే ఈ స్పెషల్ డే ని మాత్రం నెవర్ బిఫోర్ గా ప్లాన్ చేస్తున్నారు. ఈ డిసెంబర్ 23న నేషనల్ లెవెల్లో మొట్ట మొదటి సారిగా ఈ ఈవెంట్ ని రామోజీ ఫిల్మ్ సిటీ లో ప్లాన్ చేస్తున్నారట. అలాగే అదే రోజున ఫ్యాన్స్ చేత ట్రైలర్ ని కూడా లాంచ్ చేయబోతున్నట్టు అధికారికంగా తెలిపారు. మరి ఈ ఫస్ట్ ఎవర్ నేషనల్ లెవెల్ ఈవెంట్ ఎలా ఉంటుందో అని ఆసక్తి మొదలైంది.

సంబంధిత సమాచారం :