బజ్..”రాధే శ్యామ్” ఫస్ట్ సింగిల్ డేట్ అప్పటికి ఫిక్స్.?

Published on Nov 12, 2021 6:02 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన మోస్ట్ అవైటెడ్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కించిన ఈ చిత్రం ఇంట్రెస్టింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కి పాన్ ఇండియన్ వైడ్ కూడా మంచి అంచనాలు నెలకొల్పుకుంది. అయితే ఈ సినిమా పై ఎప్పుడు నుంచో ఫస్ట్ సింగిల్ కోసం చాలా ఆసక్తిగా అందరు ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి బజ్ స్టార్ట్ అయ్యింది.

ఈ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ చాలా తొందరలోనే రిలీజ్ కానుంది అని అప్డేట్ కూడా రాబోతుంది అని బజ్ వినిపిస్తుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం అయితే ఈ సాంగ్ వచ్చే నవంబర్ 15కి ఫిక్స్ అయ్యినట్టుగా గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ క్రేజీ అప్డేట్ ఎప్పుడు వస్తుందో చూడాలి. అసలే జస్టిన్ మ్యూజిక్ కోసం చాలా ఆసక్తిగా అంతా ఎదురు చూస్తున్నారు మరి ఈ ఫస్ట్ సింగిల్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :

More