“రాధేశ్యామ్”కి సాడ్ ఎండింగ్ ఉండబోతుందా?

Published on Mar 3, 2022 2:00 am IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం మార్చ్ 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో నేడు రిలీజ్ ట్రైలర్‌ని కూడా మేకర్స్ విడుదల చేశారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా క్లైమాక్స్‌కి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఈ సినిమా క్లైమాక్స్ సునామీ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని, ఈ సినిమాకి సాడ్ ఎండింగ్ ఉండబోతుందని వార్తలు వినిపిస్తున్నాయి. సునామీ సమయంలో ఒక షిప్ లో ఇరుక్కుపోయిన హీరోయిన్ పూజాహెగ్డే ను ప్రభాస్ ప్రకృతికి అడ్డుగా వెళ్లి కాపాడతాడట. ఇక క్లైమాక్స్ సన్నివేశం కోసం మాత్రమే చాలావరకు విజువల్ ఎఫెక్ట్స్ ని వాడినట్లు తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :