“రాధే శ్యామ్” హిందీ సింగిల్..బాలీవుడ్ ని ఏలడానికి ప్రభాస్ మళ్ళీ సిద్ధం!

Published on Dec 1, 2021 12:04 pm IST


పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ సినిమా “రాధే శ్యామ్”. ప్రభాస్ కి బాలీవుడ్ లో కూడా మార్కెట్ ఏర్పడ్డాక చాలా జాగ్రత్తగా తన సినిమాలను మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఆ ప్లానింగ్ ఇంకో లెవెల్లో ఉంది అని చెప్పడానికి రాధే శ్యామ్ నుంచి వచ్చిన హిందీలో ఫస్ట్ సింగిల్ ఆషికి హోగయి ని చెప్పాలి.

దర్శకుడు రాధా కృష్ణ చూపించిన విజువల్స్ కానీ తన ప్లానింగ్ కానీ ఈ సినిమాని స్యూర్ షాట్ హిట్ గా నిలిపేవిలా కనిపిస్తున్నాయి. ఇక సాంగ్ విషయానికి వస్తే బాలీవుడ్ ఆడియెన్స్ ని మాత్రమే కాకుండా మొత్తం దేశ వ్యాప్తంగా మ్యూజిక్ లవర్స్ ని ఆకట్టుకునే బ్యూటిఫుల్ ట్యూన్ ని మిథూన్ నెక్స్ట్ లెవెల్లో ఇచ్చాడు.

అలానే పూజా మరియు ప్రభాస్ ల మధ్య కెమిస్ట్రీ కూడా ఇందులో అత్యంత అద్భుతంగా కనిపిస్తుంది. టోటల్ గా రాధా కృష్ణ మేకింగ్ మాత్రం అదిరింది అని చెప్పాలి. అలానే ప్రభాస్ లుక్స్ కానీ డ్రెస్సింగ్ కానీ చాలా బాగున్నాయి.

మరి లాస్ట్ టైం తన భారీ సినిమా “సాహో” కి నెగిటివ్ ఫీడ్ బ్యాక్ తోనే బాలీవుడ్ లో ప్రభాస్ భారీ వసూళ్లు కొల్లగొట్టాడు. ఈసారి ఇది క్లాస్ సినిమానే అయినా ఈ సాంగ్ తర్వాత ఇందులోని విజువల్స్ చూస్తూనే మరోసారి బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ప్రభాస్ తన హవా మళ్ళీ చూపించడం గ్యారెంటీ అనిపిస్తుంది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :