రొమాంటీ ఫన్ గా “రాధే శ్యామ్” వాలెంటైన్ గిఫ్ట్..!

Published on Feb 14, 2022 2:04 pm IST


పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు రాధా కృష్ణ కుమార్ ఈ చిత్రాన్ని అద్భుతమైన ప్రేమ కథగా తెరకెక్కించాడు. మరి ఈ అద్భుత ప్రేమ కథ అంటే వాలెంటైన్స్ డే కి మరింత స్పెషల్ అనే చెప్పాలిగా అలానే ఈ చిత్రం నుంచి ఈ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా రిలీజ్ ప్లాన్ చేశారు.

మరి ఈ స్పెషల్ డే కి రిలీజ్ చేసిన గ్లింప్స్ వీడియో మంచి ఆసక్తిగా ఉందని చెప్పాలి. ప్రభాస్ మరియు పూజా హెగ్డే ల పై కనిపించిన విజువల్స్ వారి మధ్య కెమిస్ట్రీ మంచి రొమాంటిక్ గా సాగగా లాస్ట్ లో విక్రమ్ ఆదిత్య పై ప్రేరణ చెప్పిన డైలాగ్స్ మంచి ఫన్నీ గా ఉన్నాయి. అలానే ప్రభాస్ లుక్స్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తూ ఆకట్టుకున్నాడు. అలాగే విజువల్స్ ఇందులో బాగున్నాయి.. మొత్తానికి అయితే ఈ గ్లింప్స్ కూడా ఈ స్పెషల్ డే కి పర్ఫెక్ట్ గిఫ్ట్ అని చెప్పాల్సిందే.

గ్లింప్స్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :