“రాధే శ్యామ్” కి నెక్స్ట్ లెవెల్ ప్లానింగ్స్.!

Published on Feb 27, 2022 8:04 am IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా చిత్రం “రాధే శ్యామ్” కోసం అందరికీ తెలిసిందే. పాన్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొల్పుకున్న ఈ చిత్రాన్ని ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులు ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మరి ఇప్పుడు సమయం ఆల్ మోస్ట్ దగ్గరకి వచ్చే సరికి మేకర్స్ అదిరే ప్లానింగ్ లు కూడా వేస్తున్నారు.

మరి నిన్న అయితే దర్శకుడు రాధాకృష్ణ కొన్ని అప్డేట్స్ కూడా అందివ్వగా ఇప్పుడు ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ బయటకి వచ్చింది. ఈ సినిమా నుంచి రెండో ట్రైలర్ తో పాటుగా రెండు భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లు చేయనున్నారట. ఇవి కూడా సాలిడ్ గానే ఉంటాయని తెలుస్తోంది. మరి ఇవి ఒకటి హిందీలో కాగా మరొకటి మళ్లీ తెలుగులో ఏమో కావచ్చు. మరి వేచి చూడాల్సిందే ఈ గ్రాండ్ ఈవెంట్స్ ఎలా ఉంటాయో అనేది.

సంబంధిత సమాచారం :