ఆసక్తిగా థియేటర్స్ వరకు “రాధే శ్యామ్” వారి జర్నీ.!

Published on Mar 9, 2022 1:00 pm IST

ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చెయ్యడానికి సిద్ధం అవుతున్న లేటెస్ట్ భారీ సినిమాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం “రాధే శ్యామ్” పై ఎలాంటి అంచనాలు నెలకొన్నాయి అనేది అందరికీ తెలిసిందే.

దాదాపు మూడు సంవత్సరాలు తర్వాత మళ్ళీ ప్రభాస్ అభిమానులు బిగ్గెస్ట్ ట్రీట్ ఈ సినిమా ద్వారా లభించనుంది. అయితే లేటెస్ట్ గా మేకర్స్ అయితే ఒక ప్లెజెంట్ వీడియోని రిలీజ్ చేశారు. తాము సినిమా స్టార్ట్ చేసిన నాటి నుంచి ఇప్పుడు సినిమా ప్రమోషన్స్ ని ఏ లెవెల్లో తీసుకెళ్లి ఆ విజువల్స్ ఒక గ్లింప్స్ ని డిజైన్ చేసి విడుదల చేశారు.

అలాగే ఇన్ని ప్రమోషన్స్ తో ఫైనల్ గా ఈ మార్చ్ 11న థియేటర్స్ లోకి తమ బిగ్గెస్ట్ జర్నీ ని ఫైనల్ గా తీసుకొస్తున్నామని, ఒక పెద్ద విజన్ తో స్టార్ట్ చేసిన మా ప్రయత్నం ఫైనల్ గా ఈ శుక్రవారం మీ ముందుకు వస్తుందని తెలిపారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో అని ఆసక్తిగా అంతా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం :