బాలీవుడ్ లో “రాధే శ్యామ్” పరిస్థితి ఇదే!

Published on Mar 15, 2022 10:41 am IST


బాలీవుడ్‌లో రాధే శ్యామ్ పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. రెబల్ స్టార్, పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన రాధే శ్యామ్ అందరినీ నిరాశపరిచింది అని చెప్పాలి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. జస్టిన్ ప్రభాకరన్ ఈ చిత్రానికి సంగీతం అందించగా, మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు.

బాలీవుడ్‌లో భారీ గా విడుదల అయిన ఈ చిత్రం అంతగా ఆకట్టుకోలేక పోతుంది. సోమవారం నాడు కేవలం 1.2 కోట్లు మాత్రమే బాక్సాఫీస్ వద్ద వసూలు చేసింది. ఇది ప్రభాస్ వంటి పెద్ద హీరోకి తీవ్ర నిరాశ కలిగించే అంశం. మొదటి రోజు నుండి, ఈ చిత్రానికి హిందీలో ఎటువంటి బజ్ లేదు మరియు తెలుగు రాష్ట్రాల్లో కూడా మొదటి వారాంతంలో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి.

సంబంధిత సమాచారం :