“రాధే శ్యామ్” ఫస్ట్ లిరికల్ సాంగ్‌కి క్రేజీ రెస్పాన్స్..!

Published on Nov 15, 2021 10:29 pm IST


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కానుంది. చాలా సంవత్సరాల తర్వాత ప్రభాస్ రొమాంటిక్ జానర్‌లో చేస్తున్న సినిమా ఇది కావడం విశేషం. ఈ సినిమాలో ప్ర‌భాస్ విక్ర‌మాదిత్యగా ప్ర‌త్యేకమైన క్యారెక్ట‌రైజేష‌న్‌లో కనిపించబోతున్నాడు. అయితే ఇటీవల విడుదలైన విక్రమాదిత్య క్యారెక్ట‌ర్ టీజ‌ర్ దాదాపు 60 గంటలకు పైగా యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంది.

వింటేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఇట‌లీలో జ‌రిగే ప్రేమ‌క‌థగా తెరకెక్కిన ఈ చిత్రం నుంచి తాజాగా మొదటి లిరికల్ సాంగ్ విడుదలైంది. ఎవరో వీరెవరో అంటూ సాగే ఈ పాటకు అనూహ్యమైన స్పందన వస్తుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ద‌ర్శ‌కుడు రాధా కృష్ణ ప్రభాస్‌ని సరికొత్త లుక్‌లో ప్రెజెంట్ చేశాడు. జస్టిన్ ప్రభాకరన్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ, కమల్ కన్నన్ విజువల్ ఎఫెక్ట్స్ అద్భుతంగా ఉన్నాయి. కోటగిరి వెంకటేశ్వరరావు దీనికి ఎడిటింగ్ వర్క్ చేశారు. యువి క్రియేష‌న్స్ ప్రొడక్షన్స్ వాల్యూస్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ర‌వీంద‌ర్ చాలా మంచి ప్లానింగ్ తో డిజైన్ చేశారు. సౌండ్ ఇంజ‌నీర్ ర‌సూల్ పూకుట్టి వ‌ర్క్‌ అద‌న‌పు ఆకర్ష‌ణ అని చెప్పాలి.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :