యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్గా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్”. యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మిశ్రమ స్పందనను తెచ్చుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్లో కలెక్షన్లు బాగానే ఉన్నా వీక్ డేస్‌లో మాత్రం భారీగా తగ్గిపోయాయి. దానికి తోడు ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం కూడా రాధేశ్యామ్ కలెక్షన్స్‌పై బాగానే ప్రభావం చూపించింది. అసలు రాధేశ్యామ్ ఫైనల్ కలెక్షన్లు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దాం.
నైజాం – 24.80 కోట్లు
సీడెడ్ – 7.46 కోట్లు
ఉత్తరాంధ్ర – 4.90 కోట్లు
గుంటూరు – 4.50 కోట్లు
ఈస్ట్ – 4.34 కోట్లు
వెస్ట్ – 3.32 కోట్లు
కృష్ణ – 2.71 కోట్లు
నెల్లూరు – 2.14 కోట్లు
ఏపీ+తెలంగాణ = 54.17 కోట్లు (84.60కోట్ల గ్రాస్)
తమిళనాడు = 0.76 కోట్లు
కేరళ = 0.18 కోట్లు
కర్ణాటక = 4.20 కోట్లు
హిందీ = 10.70 కోట్లు
ఓవర్సీస్ = 11.42 కోట్లు
వరల్డ్ వైడ్ కలెక్షన్స్ = 83.12 కోట్లు (151కోట్ల గ్రాస్)
అయితే రాధేశ్యామ్ చిత్రానికి రూ.208 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో రూ.210 కోట్ల బ్రేక్ ఈవెన్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫైనల్‌గా రూ.83.12 కోట్ల షేర్ కలెక్షన్లను సాధించింది. ఫుల్‌రన్ ముగిసే సరికి 126 కోట్ల వరకు ఈ చిత్రాన్ని కొన్న బయ్యర్స్ నష్టాలపాలైనట్టు తెలుస్తుంది.