“రాధేశ్యామ్” నుండి మరో స్పెషల్ అప్డేట్.. రేపు ఆ సాంగ్ టీజర్..!

Published on Dec 13, 2021 9:00 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడిక్ లవ్ స్టోరీ “రాధే శ్యామ్”. భారీ బ‌డ్జెట్‌తో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపుదిద్దుకున్న ఈ పాన్ ఇండియన్ చిత్రం సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్లను వేగవంతం చేస్తున్నారు.

గత కొద్ది రోజులుగా ఈ సినిమా నుంచి వస్తున్న వరుస అప్డేట్స్ సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేశాయి. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మేకర్స్ మరో స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. రేపు మధ్యాహ్నం 1 గంటకు “సంచారి” సాంగ్ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో సంచారి పాటకు సంబంధించిన ప్రభాస్ న్యూలుక్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.

సంబంధిత సమాచారం :